తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అధినేత కేసిఆర్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలోని హామీలు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసే విధంగా, ఆమోదయోగ్యంగా ఉండడంతో బిఆర్‌ఎస్ మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేయగా.. ఆ హామీలను కొనసాగిస్తూనే మరిన్ని కొత్త హామీలను కూడా ప్రకటించారు.
సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3 వేల గౌరవ వేతనం. దివ్యాంగులకు, పెన్షన్లు రూ.6 వేలకు పెంపు,ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు, రైతు బంధు కింద ఇస్తున్న రూ.10 వేల నగదు సాయాన్ని రూ.16 వేలకు పెంపు ( దశల వారీగా ) ఆరోగ్య శ్రీ పథకం రూ.15 లక్షలకు పెంపు, అర్హులైన వారందరికీ రూ.400 లకే సిలిండర్.. ఇలా ప్రజాల అవసరతలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రూపొందించడంతో బిఆర్‌ఎస్ మేనిఫెస్టో పై ప్రశంశలు వెల్లువెత్తుహున్నాయి. ఇక అధికార పార్టీ హామీల ప్రకటనతో ప్రత్యర్థి పార్టీల్లో గందరగోళం మొదలైంది. ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలు పెదవి విరిచారు. ఎందుకంటే ఆమోదానికి సాధ్యం కానీ హామీలను ప్రకటించడం, ఆల్రెడీ ఇవే హామీలను కర్నాటకలో ప్రకటించి అక్కడ అమలు చేయలేక చేతులెత్తేసింది హస్తం పార్టీ. దీంతో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు ఏ కోశాన పట్టించుకోవడం లేదు.
ఇక బీజేపీ విషయానికొస్తే ఇంకా ఇంతవరకు ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించినప్పటికీ బీజేపీ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రనికి రావాల్సిన నిధులనే పెండింగ్ పెడుతున్న బీజేపీ.. హామీలను నెరవేర్చుతుందని అనుకోవడం అతిశయోక్తే అవుతుంది. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు పేపర్ వరకే పరిమితం అవుతాయనిది అందరికీ తెలిసిన విషయమే. ఇక హామీల అమలులో తన దక్షతను చూపించే అధినేత కేసిఆర్.. ఈసారి మరింతగా ప్రజాశ్రేయస్సు కోసం మేనిఫెస్టో రూపకల్పన చేయడం హర్షించాల్సిన విషయం.
Also Read:అప్పుడు ఐర్లాండ్ చేతిలో…ఇప్పుడు ఆప్ఘాన్ చేతిలో