ఈ లక్షణాలుంటే…లివర్ చివరి దశే!

34
- Advertisement -

నేటి రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి. పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల కారణంగా లివర్ చెడిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరంలో పెరుకుపోయిన విష పదార్థాలను, వ్యర్థాలను లివర్ బయటకు పంపిస్తుంది. మరి అలాంటి లివర్ ను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను జత చేసుకోవడం వల్ల లివర్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

అయితే లీవర్ చెడిపోవడానికి 3 దశలు పడుతుంది. మొదటి దశలో ఇన్‌ఫ్లమేషన్ ,రెండోది ఫైబ్రాసిస్‌ మూడోది సిర్రోసిస్‌ చివరగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ (ఈఎస్‌ఎల్‌డీ). హెపటైటిస్ సీ చివరి దశకు చేరుకుంటే లివర్ డామేజ్ గణనీయంగా పెరుగుతుంది. ఇది కొన్నేళ్లపాటు లివర్‌ను డ్యామేజ్ చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌తో మొదలుకానుండగా ఈ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. హెపటైటిస్ సీ కారణంగా లివర్ ఫెయిల్యూర్‌ అవుతుంది.

ఈ లక్షణాలుంటే రక్త స్రావం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (జాండీస్), విపరీతమైన దురద, ఆకలి లేకపోవడం, వికారం, కాళ్లు, పొత్తికడుపులోకి ద్రవం చేరి వాపు రావడం, ఏకాగ్రత సమస్యలు రావడం ఉందంటే లివర్ చివరి దశలో ఉన్నట్లు. కాబట్టి ఏ మాత్రం సందేహం ఉన్న వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని మీ లివర్‌ని కాపాడుకోండి.

Also Read: క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -