అప్పుడు ఐర్లాండ్‌ చేతిలో…ఇప్పుడు ఆప్ఘాన్‌ చేతిలో

33
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో ఆప్ఘానిస్తాన్ సంచలనాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను 69 పరుగుల తేడాతో మట్టికరిపించి. ఇక ఇదే గ్రౌండ్‌లో ఇదే వేదికగా 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లాండ్ ఇప్పుడు ఆప్ఠాన్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (66), డేవిడ్‌ మలాన్‌ (32) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు.ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ విలవిలలాడింది. టాప్ బ్యాట్స్‌మెన్ ఉన్నా పసికూన ముందు బెంబేలెత్తిపోయారు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ 80,ఇక్రామ్‌ 58,ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ 28,రషీద్‌ ఖాన్‌ 23 పరుగులు చేశారు. ముజీబ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఇంగ్లాండ్‌కు ఇది రెండో ఓటమి కాగా ఆప్ఘాన్‌కు ఇది తొలి గెలుపు.

Also Read:డెవిల్‌లో మాళ‌వికా నాయ‌ర్‌..

- Advertisement -