Telangana BJP:కమలం’ లిస్ట్ ‘ కన్ఫ్యూజన్?

43
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో అన్నీ పార్టీలు వేగంగా అభ్యర్థుల ప్రకటన చేస్తున్నాయి. అందరి కంటే ముందే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, ఇటీవల కాంగ్రెస్ కూడా తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక మిగిలింది బీజేపీనే. ఆ పార్టీ కూడా ఇవాళ లేదా రేపు అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అభ్యర్థులను ఎన్ని దశలో విడుదల చేస్తానేది ఆసక్తిరేపుతున్న అంశం. ఎందుకంటే ఆ పార్టీలో నియోజిక వర్గాల వారికి అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పార్టీలోని కీలక నేతలందరూ పోటీ చేసినప్పటికీ.. ఇంకా అభ్యర్థులు దొరకని పరిస్థితి ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఏం చేయబోతుందనేది ఆ పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదు. .

ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు లభించ్నినప్పటికి.. అందులో చాలా వరకు ప్రజాధరణ లేనివారు కావడంతో ఎవరికి సీటు ఇవ్వాలి ఎవరిని పక్కన పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లో కాషాయ పార్టీ అధిష్టానం ఉంది. అటు అధికార బి‌ఆర్‌ఎస్ మరియు ఇటు కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థుల విషయంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యం బరిలో నిలిచే అభ్యర్థులను ఫైనల్ చేయడం కాషాయ పార్టీకి కత్తి మీద సామే. ఇక అభ్యర్థుల ప్రకటన తరువాత మేనిఫెస్టో పై కూడా దృష్టి సారించాల్సి వుంటుంది. ఇప్పటికే అన్నీ అంశాల్లోనూ కాషాయ పార్టీ చాలా వెనుకంజలో ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న పార్టీలో మాత్రం అంతర్మథనం ఇంకా అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యం కమలం పార్టీలో నెలకొన్న కన్ఫ్యూజన్ అసలు తొలగిపోతుందో లేదో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:ఈ వారం అమ్మాయే ఎలిమినేట్

- Advertisement -