దర్శకుడు పూరి జగన్నాద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన ‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కేథరిన్ త్రెసా. తర్వాత రుద్రమదేవి, సరైనోడు వంటి చిత్రాలతో మెప్పించిన ఈ బ్యూటీ తమిళంలో సైతం ఎన్నో విజయాలను అందుకుంది. సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యేగా అలరించిన కేథరిన్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న గౌతమ్ నందా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో కాథరిన్ స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ప్రముఖ హీరోయిన్స్ వాళ్ళ సినిమాలకు అరుదుగా చెప్పుకునే ఇది ఒక గొప్ప ఫీట్. కాథరిన్ తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పించాలనే ఐడియా సంపత్ నందిదని తెలుస్తోంది.
ఈ సినిమాలో మోడ్రన్, ఎనర్జటిక్ అమ్మాయి పాత్రలో నటించానని దర్శకుడు సంపత్ నంది తనను అద్భుతంగా చూపించారని తెలిపారు. ఈ సినిమా కోసం తాను డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని తెలిపింది. సంపత్ సైతం కేథరిన్ డబ్బింగ్ అద్భుతంగా చెప్పిందని ఎక్కడ కొత్తగా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ అనే భావన రాలేదని…అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని తెలిపారు. సినిమాను దర్శకుడు సంపత్ నంది అద్భుతంగా తెరకెక్కించారని తమ బ్యానర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నిర్మాతు ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే టీజర్ విడుదల చేసి, ఆడియో లాంఛ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.