ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఎందుకు తీసుకుంటుందో అనేది అర్థం కాక దేశ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. అసలు ఏంటి మాకి కర్మ అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు దేశ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి తమ స్వార్థం చూసుకుంటున్నారు బిజెపి నేతలు. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు మోడీ పాలనపై పెదవి విరుస్తున్న పరిస్థితి. ఇక ఎన్నికలు దగ్గర పడుతునన్న వేల.. సరికొత్త విధానాలతో ప్రజలపై అష్టదిగ్బంధనికి మోడీ సర్కార్ సిద్దమౌతోంది.
ఒకవైపు జమిలి ఎలక్షన్స్ అంటూ ఎన్నికలపై ప్రజల్లో గందరగోళానికి తెర తీశారు. ఇది చాలదు అన్నట్లు దేశ పేరు మార్పును కూడా తెరపైకి తెచ్చి ప్రజల నెత్తిపై మరో బాంబు వేసింది మోడీ సర్కార్. ఇండియా పదాన్ని కంప్లీట్ గా మార్చుతూ భారత్ అని ఉండేలా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికి పలు అధికారిక పత్రాలపై ఇండియా ఉన్న చోట భారత్ అని చేర్చింది. అయితే మొత్తం భారత్ గా మార్చలంటే అంతా తేలికైన పని కాదు. సామాన్యుడి గుర్తింపు కార్డులు అయిన ఆధార్, ఓటర్ , పాస్ పోర్ట్.. వంటి చాలా రకాల డాక్యుమెంట్స్ లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే మళ్ళీ దేశ ప్రజలంతా ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read:Chandrababu:క్వాష్ పిటిషన్ వాయిదా
దీంతో మోడీ తలతిక్క విధానాల కారణంగా బలీ అవుతున్నది సామాన్యుడే. ఇప్పటికిప్పుడు దేశ పేరు మార్చల్సిన అసవరం ఏముంది అనే దాని ప్రశ్నలు మోడీ వద్ద కూడా సమాధానం లేదు. బ్రిటిష్ వారు ఇచ్చిన పేరు ” ఇండియా ” అనే కారణం చూపిస్తున్నప్పటికి.. నిజానికి బ్రిటిష్ వారు రాకముందు నుంచి కూడా మన దేశాన్ని ఇండస్ గా పిలిచేవారు.. అదే పేరే కాల క్రామేనా ఇండియాగా రూపాంతరం ఛేదింది. మరి ఈ ప్రశ్నకు మోడీ సర్కార్ సమాధానం చెప్పగలదా ? అంటే ముమ్మాటికి చెప్పలేదు.
ఎందుకంటే దేశ పేరు మార్పులో రాజకీయ స్వలాభం తప్ప మరోటి లేదనేది జగమెరిగిన సత్యం. అలాగే జమిలి ఎలక్షన్స్ పై కూడా బిజెపి పార్టీ అంతర్గత వ్యవహారమే తప్పా.. తప్పనిసరి కాదనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న ఈ అంశాలపై మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే దానిపై ఈ నెల 17న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నీ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మరి మోడీ తీసుకుంటున్న ఈ స్వలాభా నిర్ణయాలపై ఎలాంటి అభిప్రాయాలూ వ్యక్తమౌతాయో చూడాలి.
Also Read:పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!