ప్రస్తుతం దేశంలో బీజేపీ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు తెరతీసింది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మోడీ సర్కార్ పై ఉండే వ్యతిరేకతను ప్రజలు మార్చి పోయేలా రకరకాల స్టంట్స్ వేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నవేళ ఇప్పుడు దేశ పేరు మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చి మరో కొత్త వివాదానికి నాంది పలికింది. జమిలి ఎన్నికల విధానానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని తెలిసినప్పటికి దాని అమలు వైపు మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇక అలాగే ఊహించని రీతిలో ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కూడా రంగం సిద్దం చేసుకుంటోంది..
ఇప్పటికే ఇండియా పదం ఉన్న చోట భారత్ పదాన్ని చేర్చుతూ మెల్లగా ఇండియా పేరును కనుమరుగు చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ప్రతిపాదనలను ఈనెలలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో జిల్లు లను ప్రవేశ పెట్టె అవకాశం ఉందట. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మోడీ సర్కార్ ఇప్పుడేందుకు కన్యూజన్ పాలిటిక్స్ కు తెరతీస్తోంది అనడానికి విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్ పై మణిపూర్ అల్లర్ల విషయంలో ఈ మద్య తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది.
ఇది ఎన్నికల సమయానికి మరింత ముదిరిన ఆశ్చర్యం లేదు. అందువల్ల దాని ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆ టాపిక్ ను ప్రజల్లో నుంచి సైడ్ చేసేలా జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక మోడీ సర్కార్ కు చెక్ పెట్టెల విపక్షాలన్నీ ఏకమైన కూటమికి ఇండియా పేరును ప్రతిపాదించడంతో.. మోడీ సర్కార్ ఏకంగా జాతీయవాదాన్నే తెరపైకి తెస్తూ ఇండియా ను భారత్ గా మార్చే వ్యూహానికి పదును పెట్టింది.. అయితే ఈ వ్యూహాలన్నీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నప్పటికి బీజేపీ కన్యూజన్ పాలిటిక్స్ చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read:పాలలో బెల్లం కలిపి తాగుతున్నారా!