ఆ బ్యూటీకి బాలయ్య బాబాయ్‌ అట

9
- Advertisement -

cగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించబోతున్నారు. తాజాగా భగవంత్‌ కేసరి విశేషాలు, బాలకృష్ణతో తెర పంచుకున్న అనుభవాలను శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలియచేసింది. ఈ సందర్భంగా బాలయ్యపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. తాను సినిమా చేస్తున్నంతసేపు ఆయన తనకు సొంత బాబాయ్‌ లాగే అనిపించారని చెప్పింది. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉన్నట్టు శ్రీలీల కామెంట్స్ చేసింది.

మొత్తానికి శ్రీలీల బాలయ్యని బాబాయ్ గా ఫిక్స్ అయ్యింది. ఎలాగూ సినిమాలో కూడా బాలయ్య, శ్రీలీల బాబాయ్‌, కూతుళ్లుగానే నటించారు. ఇక శ్రీలీల గురించి రోజు ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా డేట్స్ సమస్యల కారణంగా శ్రీలీల ఓ చిత్రం నుంచి తప్పుకోనుందని వార్తలు వినిపించాయి. వీటిపై శ్రీలీల క్లారిటీనిచ్చింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుందని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. శ్రీలీల మాట్లాడుతూ.. ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. దీని గురించి అధికారికంగా మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా’ అని ప్రశ్నించింది.

Also Read:పిల్లల ఆరోగ్యానికి తేనె మంచిదేనా?

మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా శ్రీలీల ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే కన్నడ ఇండస్ట్రీలో శ్రీలీల ఓ పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. హీరో గణేష్ తో శ్రీలీల ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఆ విషయం కాస్తా గణేష్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు అయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు టాక్. మొత్తానికి శ్రీలీల పై నిత్యం పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో

- Advertisement -