బీజేపీ కాంగ్రెస్ కుల్లు బుద్దికి ఇదే నిదర్శనం!

15
- Advertisement -

తమలో ఉండే లోపాలను ఎత్తిచూపుకునే దైర్యం ఉండదు గాని ఎదుటివారి మంచిని మాత్రం చెడుగా చిత్రీకరించేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు… రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్న ఒకే ఎజెండాతో పని చేస్తూ దేశ ప్రజలకు ముసుగు కప్పే ప్రయత్నం చేస్తుంటాయి. తమ వద్ద లేనిది ఇంకొకరి వద్ద చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం, ఎదుటివారి అభివృద్దిని చూసి ఓర్వలేకపోవడం బీజేపీ కాంగ్రెస్ నేతల వంకర బుద్దిలో భాగమే.

ఇంతకీ విషయమేమిటంటే.. రాష్ట్రం విడిపోక ముందు విద్యుత్ కొరతతో ప్రజా ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన కే‌సి‌ఆర్.. రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ పైనే దృష్టి కేంద్రీకరించి తన విజన్ తో తన పాలన దక్షతతో 24 గంటల ఉచిత కరెంట్ కు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఉచిత విధ్యుత్ విద్యుత్ ను అమలు చేస్తూ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు కే‌సి‌ఆర్. దేశంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానీ రీతితో ఈ పథకం అమలు అవుతుండడంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఓర్వలేని వంకర బుద్దితో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. తరచూ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు కావడంలేదని అక్రమ విమర్శలు చేస్తూ రాజకీయ లభ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిగులు విద్యుత్ రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అందువల్ల నోటి మాటతో ఉచిత విద్యుత్ పై విమర్శలు గుప్పించిన లెక్కలు మాత్రం తప్పుచేప్పౌవుకదా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలు, సంకీర్ణ ప్రభుత్వంతో ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో విద్యుత్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. హరియాణ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మద్యప్రదేశ్ బిహార్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన కరెంట్ కొరత ఉంది. కానీ వాటి పాలిత రాష్ట్రాలల్లోని లోపాలను సరిచేసుకోవడం తెలియదు గాని. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ దేశంలోనే అగ్రపథంలో దూసుకుపోతున్న తెలంగాణపై మాత్రం వంకలు పెడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఈ పార్టీల వంకర బుద్ది ప్రజలకు తెలియనిది కాదు. తెలంగాణలో ఆమ్లలౌతున్న ఉచిత విద్యుత్ పై బురద చల్లలని ఎంత ప్రయత్నించిన ఆ బురద తిరిగి ఆ పార్టీలకే అంటుకుంటుందనేది వాస్తవం.

Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో

- Advertisement -