స్వైన్ ఫ్లూ లక్షణాలివే.. జాగ్రత్త!

18
- Advertisement -
వర్షాకాలంలో జబ్బుల బారిన పడడం సర్వసాధారణం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి త్వరగా వ్యాప్తి చెంది రకరకాల వ్యాధులకు కారణం అవుతుంటాయి. దీంతో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధుల బారిన పడడం ఖాయం. ముఖ్యంగా వర్షాకాలంలో స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల చాలా జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్1 ఎన్1 వైరస్ కారణంగా చెందే ఈ వ్యాధిని సరిగా గుర్తించలేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందట. పందుల ద్వారా వృద్ది చెందే ఈ వైరస్ వర్షాకాలంలో వేగంగా విస్తరించే విస్తరిస్తుంది. అందువల్ల స్వైన్ ఫ్లూ పట్ల అలెర్ట్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ యొక్క స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, వాటి నివారణ చర్యలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై వివరాలను తెలుసుకుందాం !

లక్షణాలు
జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడం, తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ముక్కు దిబ్బడ, జలుబు, వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం, వీటితో పాటు కొంతమందిలో వాంతులు విరోచనలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉండి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన న్యుమోనియా కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు
స్వైన్ ఫ్లూ అంటువ్యాధి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వ్యక్తికి వీలైనంతా దూరం పాటించాలి. పై లక్షణాలు ఏమాత్రం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్న పిలల్లకు, గర్భిణీలకు ఈ వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ కాబట్టి వారు మరింత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. స్వైన్ ఫ్లూ వ్యాధికి నయం అయినప్పటికి మరికొన్ని రోజులు  వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.

- Advertisement -