Asia cup 2023 : నేడు గెలిస్తే పాక్ తో మరో ” మార్ ” !

12
- Advertisement -

ఆసియా కప్ లో భాగంగా నేడు పసికూన నేపాళ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. మొన్న జరిగిన దాయాదిల పోరులో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని సమంగా పంచుకున్నాయి టీమిండియా పాకిస్తాన్ జట్లు. కాగా పాక్ తో మ్యాచ్ అనగానే ప్రస్టేజియస్ గా తీసుకునే భారత జట్టు గత మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టాప్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెలవంగా నిలవడం జట్టును కలవరపెట్టె అంశం. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్, ఘోరంగా నిరాశపరిచారు. పాక్ తో మ్యాచ్ అనగానే నిప్పులు చేమ్మే ప్రదర్శనతో చెలరేగే కింగ్ కోహ్లీ గత మ్యాచ్ లో ఆ ఫైర్ కోల్పోయాడు..

ఇక రోహిత్ ఎప్పటిలాగే తన ఫామ్ లేమిని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక భవిష్యత్ ఆశాకిరణంలా నిలుస్తాడని భావిస్తున్న గిల్.. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ పిచ్ లపై విఫలం అవుతున్నాడు. అయితే మిడిలార్డర్ లో ఇషాన్ కిషన్, హర్ధిక్ పాండ్య మెరుగ్గా రాణిస్తుండడం సానుకూలాంశం. కాగా నేడు నేడు నేపాల్ తో జరిగే మ్యాచ్ లో లోపాలన్నీ సరిచేసుకోవాల్సిన అవసరత ఉంది.పసికూనే అని తేలిగ్గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నేపాల్ తో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే సూపర్ 4 కు చేరుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన చెరో పాయింట్ తో సూపర్ 4 కు చేరుకునే ఛాన్స్ ఉంది. అలా కాకుండా నేపాల్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ 4 కు చేరుకోవడంతో భారత్ కూడా సూపర్ 4 కు చెరుకుంటే దాయాదిల పోరు మరోసారి చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సూపర్ 4 లో ఉన్న ప్రతి జట్టు మూడేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి పాక్ తో మ్యాచ్ పక్కాగా జరిగే అవకాశం ఉంది. కాగా పాక్ తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా అభిమానులను నిరాశ పరచడంతో సూపర్ 4 లో తలపడే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also read:భారీ బ‌డ్జెట్‌తో.. ‘చంద్రముఖి 2’

- Advertisement -