PM Modi:ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్

53
- Advertisement -

చంద్రుడిపైకి మేకిన్ ఇండియాను తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకుని, మీకు నమస్కరించాలని, మీ ప్రయత్నాలకు సెల్యూట్ చేయాలని కోరుకున్నానని వెల్లడించారు. అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని…ఇస్రో సాధించింది.. మామూలు విజయం కాదని.. దేశం మొత్తం గర్విస్తుందని వెల్లడించారు.

అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 సరికొత్త చరిత్రను లఖించిందని.. ప్రపంచంలోనే భారత్ అత్యున్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. చంద్రయాన్2 లునార్ ల్యాండింగ్ ప్రదేశాన్ని తిరంగాగా పిలువనున్నట్లు చెప్పారు. చంద్రయాన్-3 యువతకు స్ఫూర్తిదాయకం… చంద్రయాన్2 వైఫల్యంతో వెనకడుగు వేయలేదని.. రెట్టింపైన ఉత్సహాంతో పనిచేశారంటూ శాస్త్రవేత్తలను అభినందించారు.

అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 బెంచ్‌మార్క్‌ను నెలకొల్పిందని…ఆగస్టు 23న ఏటా నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తామని వెల్లడించారు.

Also Read:సేవకు మారుపేరు మదర్ థెరిసా..

- Advertisement -