రాస్ బెర్రీస్..తింటే ఏమవుతుందో తెలుసా?

36
- Advertisement -

రాస్ బెర్రిస్ పండ్లు ఇవి అన్నీ సమయల్లో అన్నీ చోట్ల దొరకవు. స్ట్రాబేరి లాగే కనిపించే ఈ రాస్ బెర్రిస్ ఎక్కువగా ఐస్ క్రీమ్ పార్లలలోనూ, బేకరీ షాప్ లలోనూ జ్యూస్ షాప్ లలోనూ ఉపయోగిస్తూ ఉంటారు. రాస్ బెర్రిస్ పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ సి.. వంటి వాటితో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. .

రాస్ బెర్రిస్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె పని తీరును మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. రాస్ బెర్రిస్ పండ్లలో మాంగనీస్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి మధుమేహం బారిన పడకుండా చూస్తుంది. వీటిలో ఎల్లాజిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది.. ఇది చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తులు, మూత్రశాయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి కారకాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: నిమ్మకాయ ఎక్కువగా తింటే ప్రమాదమా?

ఇంకా వీటిలో ఉండే కొల్లాజిన్.. ఎముకలు మరియు దంతాలను బలపరచడంతో పాటు చర్మం యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. రాస్ బెర్రిస్ లో కీటోన్ అనే మూలకం ఉంటుంది ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది. మతిమరుపు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రాస్ బెర్రిస్ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు మతిమరుపును దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రాస్ బెర్రిస్ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్న రాస్ బెర్రిస్ పండ్లను దొరికితే తప్పని సరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని

- Advertisement -