మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన తాజా చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ దిశగా వెళ్తోంది. దీంతో మెగాస్టార్ చేయబోయే తర్వాతి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణపై ఆ భారం పడింది. తాజాగా స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయాలని చిరు కూడా చెప్పారట. మొత్తానికి భోళా శంకర్ పరాజయం కళ్యాణ్ కృష్ణను ఇబ్బంది పెట్టనుంది. ఇంతకీ, మెగాస్టార్ సినిమాను కళ్యాణ్ కృష్ణ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా ఆగస్ట్‌లోనే మొదలు కానుంది.
ఇదిలా ఉండగా భోళా శంకర్ చిత్రం హిందీలోనూ విడుదల కానుంది. ఆగస్టు 25న భోళా శంకర్ హిందీ వెర్షన్ థియేటర్లలోకి వస్తోందని ఆర్కేడీ స్టూడియోస్ ప్రకటించింది. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భోళా శంకర్ ఈ నెల 11న తెలుగులో రిలీజైంది. విడుదలైన మొదటి రోజునే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. అయినాసరే హిందీలో కూడా రిలీజ్ చేస్తుండటం నిజంగా విశేషమే. మరోపక్క మెగాస్టార్ తన మోకాలి సర్జరీ కోసం రెండు నెలలు పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు.
గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన మెగాస్టార్ చిరంజీవి 2016లో కుడి, ఎడమ భుజాలకు ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ తర్వాత దాదాపు 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. తర్వాత పూర్తిగా కోలుకున్నాకే కళ్యాణ్ కృష్ణ సినిమాని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ హిందీలోనూ విడుదల కానున్న ‘భోళా శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read:వచ్చే ఆగష్టు 15..మోడీ మాజీ ప్రధాని అవుతారా?