ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక తీర్చిన సలార్

31
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా స‌లార్. టీజ‌ర్‌తో అంచ‌నాలు పెంచుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ.. స‌లార్ టీమ్ ఇంకా సైలెంట్‌గానే ఉండ‌టంతో ఈ సినిమా మ‌ళ్ళీ పోస్ట్‌పోన్ అవుతుందేమోన‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెగ కంగారు ప‌డుతున్నారు. దీంతో ‘సలార్’ నుంచి తమకు అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ నుంచి భారీగా డిమాండ్ వచ్చింది. ఫ్యాన్స్ నుంచి భారీ పోస్ట్ లు రావడంతో.. ఎట్టకేలకు ‘సలార్’ టీమ్ స్పందించింది.

ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సినిమా స్ఫూర్తితో అభిమానులు రూపొందించిన సాంగ్‌ వీడియోను ట్వీట్ చేసింది. ‘సలార్ టైటిల్ సాంగ్’ పేరుతో ఫ్యాన్స్ రచించిన సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మేము మీకోసం భారీగా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ చెప్పడంతో.. ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్న అప్ డేట్ ను సలార్ టీమ్ అందించింది. ఇప్పటివరకు ఇండియన్‌ స్క్రీన్‌పైన చూడని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సలార్ సినిమాలో ఉండబోతున్నట్లు టీమ్ హింట్ ఇచ్చింది.

ఎంతైనా ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ యాక్షన్ డైరెక్టర్. సో.. ఏ రకంగా చూసుకున్నా.. ప్రభాస్ ను అద్భుతంగా చూపించడం ఖాయం. అన్నట్టు స‌లార్ స్టోరీలైన్ విషయానికి వస్తే.. సున్న‌పురాయి మైనింగ్, ఫార్మా మాఫియా నేప‌థ్యంలో యూఎస్ ఆర్మీతో ఈ స్టోరీ క‌నెక్ట్ అయి ఉంటుందది. స్టోరీ లైన్‌లో కొన్ని అంశాలు కేజీఎఫ్-2కి లింక్ అయ్యేలా ఉంటాయ‌ని టాక్. ప్రభాస్ క్యారెక్టర్ కూడా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా యాక్షన్ అభిమానులకు సలార్ ఫుల్ కిక్ ఇవ్వనున్నాడు.

Also Read:కర్నాటకలో కాంగ్రెస్ ఢమాల్..హింట్ ఇచ్చిన బీజేపీ!

- Advertisement -