Janasena:పవన్ ప్రశ్నల వర్షం అగదా?

13
- Advertisement -

ఏపీలోని జగన్ సర్కార్ పై పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంధిస్తున్న ప్రశ్నల అస్త్రాలు ఆగేలాలేవు. ఇప్పటికే వాలెంటర్ల విషయంలో పవన్ లేవనెతున్న ప్రశ్నలు, ఆరోపణలు పోలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. వాలెంటర్లు ప్రజల డేటా చోరీకి పాల్పడుతున్నారని, ప్రైవసీ పరంగా అది చట్ట విరుద్దం అని, వాలెంటర్లు ఎవరి అధీనంలో పని చేస్తున్నారో చెప్పాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి ఇప్పటికి సరైన సమాధానం రాలేదు. ఇక గతంలో డేటా ప్రైవసీ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రజల డేటా వేరే వ్యక్తి తీసుకోవడం క్రైమ్ అని జగన్ గతంలో చెప్పిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ.. ఇప్పుడు వాలెంటర్లతో ఎందుకు డేటా చోరీ చేయిస్తున్నారని, అసలు వాలెంటర్లకు బాస్ ఎవరని మరోసారి ప్రశ్నించారు.

Also Read:కాంగ్రెస్‌కు సీనియర్ల ముప్పు?

ఇక వాలెంటర్ల పై ఈ విధమైన ప్రశ్నలు సంధిస్తూనే.. ఇక ఇప్పుడు విద్యారంగం టార్గెట్ గా పవన్ సందిస్తున్న మరికొన్ని ప్రశ్నలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుందా చేస్తున్నాయి.. ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్.. డీఎస్సీ ఎందుకు విడుదల చేయడం చేయడం లేదని, టీచర్ల రిక్రూట్మెంట్ ఎందుకు జరగడం లేదని, ప్రశ్నిస్తూనే నష్టాల్లో ఉన్న బైజూస్ కు ఎందుకు కాంట్రాక్ట్ లు ఇస్తున్నారని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న బైజూస్ కు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏమిటని పవన్ ప్రశ్నలు సంధించారు. ఇలా పవన్ ఆయా వ్యవస్థలపై సంధిస్తున్న ప్రశ్నలు వైసీపీని ఇరకాటంలో పెట్టె విధంగానే ఉన్నాయి. ఇప్పటికే వాలెంటరీ వ్యవస్థపై సంధించిన ప్రశ్నల విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వని వైఎస్ జగన్.. ఇప్పుడు విద్యారంగంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఎంతవరుకు సమాధానం ఇస్తారో చూడాలి.

- Advertisement -