ప్రభాస్ vs షారూఖ్.. బాక్సాఫీస్ బాద్షా ఎవరు ?

25
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రెండు సినిమాల గురించి గట్టిగా వెయిటింగ్ నడుస్తోంది. అందులో ఒకటి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ జవాన్ కాగా మరోటి రెబెల్ స్టార్ ప్రభాస్ ” సలార్ మూవీ. ఈ రెండు సినిమాలపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఫిక్స్ లో ఉన్నాయి. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఆగ్ర హీరోలను సైతం వెనక్కి నెట్టే విధంగా ప్రభాస్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. బాహుబలి సిరీస్ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు నిరాశ పరిచినప్పటికి ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. .

దీనికి నిదర్శనమే సలార్ టీజర్.. టీజర్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఊందో చెప్పకనే చెప్పింది. ఇక ఈ మద్య బాలీవుడ్ పనైపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో షారుక్ ” పఠాన్ ” మూవీతో తిరిగి ఊపిరినిచ్చాడు. ఈ మూవీ షారుక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో షారుక్, ప్రభాస్ మద్య సలార్, జవాన్ మూవీస్ తో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడనుంది.

Also Read:కాంగ్రెస్ బీసీ మంత్రం.. ఫలిస్తుందా ?

ముందుగా షారుక్ ఖాన్ ” జవాన్ ” మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 8 న రిలీజ్ అవుతుండగా అదే నెలలోనే సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఎవరు వెయ్యి కోట్లు అందుకుంటారు ? ఎవరు నిజమైన బాక్సాఫీస్ బాద్షా గా నిలుస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉండడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ రికార్డ్స్ లో కొత్త లెక్కలు నమోదు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇండియన్ బాక్సాఫీస్ ను ఎవరు షేక్ చేస్తారో చూడాలి.

Also Read:తమిళ్ తంత్రం.. బీజేపీ ఏం చేయబోతుంది?

- Advertisement -