కాంగ్రెస్ బీసీ మంత్రం.. ఫలిస్తుందా ?

30
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడాలకు తెర తీస్తోందా ? కుల ప్రతిపాధికన ఓటర్లను ఆకర్శించేందుకు వ్యూహాలు రచిస్తోందా ? అంటే అవుననే సమాధానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని చెబుతున్న హస్తం నేతలు..గెలుపు కోసం అన్నీ రకాల సమీకరణలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా ఉండే బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హస్తం పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నియోజిక వర్గాలలో కనీసం మూడు స్థానాలలో బీసీలను బరీలో దింపేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తునంట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే హస్తం పార్టీ బీసీలపై ఎంత ఫోకస్ చేసిందే స్పష్టంగా అర్థమౌతోంది. కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటర్లే పునాదుల్లాంటి వాళ్ళని, పార్లమెంట్ సెగ్మెంట్ లోని మూడు అసెంబ్లీ స్థానాల్లోనైనా బీసీలను బరీలో దింపే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆగష్టు లో బీసీ గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా హనుమంతరావు చెప్పుకొచ్చారు.

మరి బీసీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. తెలంగాణలో దాదాపు 1.39 కోట్లకు పైగా బీసీ ఓటర్లు ఉంటారని పలు సర్వేలు చెబుతున్నాయి. 2014 మరియు 2018 ఎన్నికల్లో బీసీ ఓటర్లు బి‌ఆర్‌ఎస్ కు అండగా నిలుస్తూ వచ్చారు. బీసీ సంక్షేమం కోసం కే‌సి‌ఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు, విధానాలుతో బీసీలలో బి‌ఆర్‌ఎస్ సుస్థిర స్థానం సంపాధించుకుంది. ఈ నేపథ్యంలో బీసీలను బి‌ఆర్‌ఎస్ నుంచి దూరం చేయడం అంతా తేలికైన విషయం కాదు. గత అనుభవాల దృష్ట్యా బీసీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ ఎత్తుకున్న బీసీ మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read:పవన్ కు జగన్ శత్రువు కదా..?

- Advertisement -