బీజేపీ నేతృత్వంలోనే షిండే సర్కార్‌లో ఎన్సీపీ చేరడంపై స్పందించారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే. ఎన్సీపీ నేత అజిత్ పవార్…బీజేపీ-శివసేన సర్కార్‌లో చేరడం వెనుక శరద్ పవార్ హస్తం ఉందన్నారు.
మహారాష్ట్రలో ఇలాంటి పద్దతులకు శ్రీకారం చుట్టిందే శరద్ పవార్ అని మండిపడ్డారు. 1978లో నాటి వసంతదాదా పాటిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పవార్ చీల్చారు. అప్పుడు పవార్‌తో మొదలైన ఈ కార్యక్రమాలు పవార్‌తోనే ముగిశాయన్నారు.
Also Read:‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి..
అజిత్ పవార్‌తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు. ఇది రాష్ట్ర ఓటర్లను అవమానించడమేనని చెప్పుకొచ్చారు.
Also Read:తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి