Project K:మొదటి రోజే రూ.500కోట్లు .. తమ్మారెడ్డి

40
- Advertisement -

ఇటీవల సినిమాలు వంద రెండు వందల కోట్ల మార్క్‌ దాటుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ దర్శక- నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్ట్‌కే గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్‌కే సెట్‌కు రెండు మూడుసార్లు వెళ్లా…సినిమా మేకింగ్ చూసి ఆశ్చర్యపోయా…ఖచ్చితంగా ఇది వరల్డ్‌ టాప్‌-50 కలెక్షన్స్ సినిమా జాబితాలో నిలబడుతుందని అన్నారు. అయితే దీన్ని సరిగ్గా ప్రొజెక్ట్‌ చేయగలిగితే రూ.10వేలు, రూ.20వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని అన్నారు. ఈ సినిమా మొదటి రోజే 500కోట్లు రావచ్చు. ఎందుకంటే ప్రభాస్‌ ఆదిపురుష్‌ మొదటి రోజు రూ.140కోట్లు వసూలు చేసింది. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఈ చిత్ర బృందానికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నా. అలాగే క్రాస్‌ చేయకపోతే రాజమౌళి-మహేశ్‌బాబుల కాంబీనేషన్‌లో వచ్చే సినిమా దీన్ని దాటేస్తుందని తెలిపారు. ఆడుతూ పాడుతూ రూ.1000కోట్లు కలెక్ట్‌ చేస్తుందన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్తుంది.

Also Read: బాలయ్యకి నయనతారే కావాలట

నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్ యాక్షన్‌. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణే కథానాయిక. ఇటీవల మూవీ మేకర్స్ కమల్ హాసన్‌ కూడా ఈ సినిమాలో భాగమవుతన్నట్టు ప్రకటించారు. ఈసినిమాను వచ్చే యేడాది విడుదుల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ సన్నాహాలు చేస్తోంది.

Also Read: ఈ స్టార్ల పూర్తి పేర్లు మీకు తెలుసా ?

- Advertisement -