షర్మిల కామెంట్స్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా ?

51
- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో వైఎస్ షర్మిల గురించి హాట్ హాట్ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ కు మద్దతు తెలుపబోతోందని, ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గాని.. ప్రస్తుతం షర్మిల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆమె నిజంగానే కాంగ్రెస్ వైపు అడుగులేస్తోందా ? అనే డౌట్ వ్యక్తమౌతోంది. తాజాగా ఆమె రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” మీరు పట్టుదల, సహనంతో ప్రజలకు సేవ చేస్తూ అందరికీ స్పూర్తినివ్వాలి. ఆరోగ్యం, సంతోషంతో విజయం సాధించాలని కోరుకుంటున్నాను ” అంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వైఎస్ షర్మిల..

ఎప్పుడు కాంగ్రెస్ పై విరుచుకుపడే షర్మిల.. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పై సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత అనూహ్యంగా ఆమె డీకే శివకుమార్ తో పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తరువాత షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామంటూ టి కాంగ్రెస్ నేతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటు షర్మిల కాంగ్రెస్ పై విమర్శలు తగ్గించడంతో ఆమె హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదన బలపడుతూ వచ్చింది. ఇక తాజాగా ఆమె రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఆ వాదన నిజం అయ్యేలాగే కనిపిస్తోంది. అయితే ఆ మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల స్వీకరిస్తే ఒకే అని అలా కాకుండా తెలంగాణలో ఆమె కాంగ్రెస్ ను ఎలాలని చూస్తే కుదరదని తేల్చి చెప్పారు. దీంతో మరి రాబోయే రోజుల్లో షర్మిల విషయంలో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు చేయనుంది. ? షర్మిల కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: CM KCR:తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం

- Advertisement -