తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు నటుడు మనోజ్ బాజ్‌పేయి. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా ప్రమోషన్ సందర్భంగా పాట్నా వచ్చిన మనోజ్..మూడు జాతీయ, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగానే ఉంటానని తెలిపారు.
గత సంవత్సరం సెప్టెంబరు నెలలో బీహార్ రాష్ట్రంలో పర్యటించినపుడు తాను రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లను కలిశానని తెలిపారు. కానీ తాను రాజకీయాల్లోకి 200 పర్సంట్ రానని…తన సొంత రాష్ట్రమైన బీహారులో చలనచిత్ర నిర్మాణానికి అపార అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలోని కళాకారులకు ప్రోత్సహించేలా కొత్త ఫిలిం పాలసీని తీసుకు రావాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
Also Read:కంటి చూపు కాపాడుకోండిలా !
బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లా బెల్వా గ్రామం మనోజ్ స్వగ్రామం. విలక్షణ నటనతో మంచి ఆదరణ దక్కించుకున్నారు.