9 సంవత్సరాలు..68 దేశాలు

40
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్ని దేశాలు పర్యటించారో తెలుసా?. ఏకంగా 68 దేశాలు. ఒక్క 2020లో తప్ప మిగితా అన్ని సంవత్సరాల్లో ఏదో ఒక దేశంలో పర్యటించారు మోడీ.

మోడీ అత్యధికంగా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ రెండు దేశాలకు ఏడు సార్ల చొప్పున వెళ్లారు. తన 68వ విదేశీ పర్యటనలో మోదీ… జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో ఆయా దేశాల అధినేతలను కలిశారు. పలు దేశాల్లో పర్యటనలు ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేస్తే, మరికొన్ని పర్యటనలు జీ 7, జీ 20, క్వాడ్ వంటి కూటముల సదస్సుల కోసం చేస్తున్నారు.

Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..

ఇక మోడీ ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఆరేసి సార్ల చొప్పున పర్యటించారు. చైనా, నేపాల్, రష్యాల్లో అయిదేసి సార్ల చొప్పున పర్యటించారు . 2020 ఏడాది కరోనా విజృంభణ సమయంలో మాత్రం విదేశీ పర్యటన ఒక్కటీ చేయలేదు.

Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

- Advertisement -