ఏపీలో బిజెపి వైసీపీ మధ్య అంతర్గత సంబంధం ఉందా ? మోడీతో దోస్తీ జగన్ కోరుకుంటున్నారా ? వైసీపీ బిజెపి మధ్య అసలేం జరుగుతోంది ? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే తమకు ఏ పార్టీతో పొత్తు లేదని ఎన్నికలకు ఒంటరిగానే బరిలోకి వెళతామని సిఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే బీజేపీపై మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నేతలు గాని విమర్శలు చేయడం చాలా అరుదు.
బీజేపీ జనసేన పార్టీలు ప్రస్తుతం పొత్తులో ఉన్నప్పటికి జనసేన టార్గెట్ గానే విమర్శలు చేస్తారు తప్పా బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయరు వైసీపీ నేతలు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, విభజన హామీలను నెరవేర్చడంలోనూ ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తూ వస్తోంది. అయినప్పటికి మోడీ సర్కార్ పై ఎలాంటి విమర్శలు గాని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడడం గాని చేయడం లేదు వైఎస్ జగన్.
Also Read: కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !
దీన్ని బట్టి చూస్తే వైసీపీ బీజేపీ మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయనే వాదన బలపడుతోంది. ఇక ఇటీవల వైఎస్ జగన్ కు తలనొప్పిగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కేంద్రం జగన్ కు అండగా నిలుస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కాకుండా తిరుగుతున్నప్పటికి అరెస్ట్ చేయలేని పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే కేంద్రం అండ ఉందనేది కొందరు చెబుతున్నా మాట. అయితే బహిరంగంగా ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేనప్పటికి అంతర్గత ఒప్పందం కుదిరిందనేది ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
Also Read: నూతన పార్లమెంట్ ఓపెనింగ్‌కు విపక్షాలు బాయ్‌కట్

