KTR: ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌కు ఆగం కావొద్దు

54
- Advertisement -

ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌కు ఆగం కావొద్దు అన్నారు మంత్రి కేటీఆర్. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భలో కేటీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలో మంచి నాయ‌క‌త్వాన్ని చేజార్చుకోవ‌ద్దు.. కేసీఆర్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి ముఖ్య‌మంత్రిని చేద్దామ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు మ‌నంద‌రి స‌మిష్టి కృషి కావాల‌న్నారు. మ‌న‌మే క‌థానాయ‌కుల‌మై క‌ద‌లి రావాలి. కేసీఆర్‌ లాగా విజృంభించాలి. నిర్మాణం మాత్ర‌మే తెలిసిన మ‌నం.. విధ్వంసం తెలిసిన దుర్మార్గుల‌తో జ‌రుగుతున్న పోరాటంలో వారి కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

బెల్లంప‌ల్లిలో నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాన్ని త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. 350 ఎక‌రాల్లో ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 27 కంపెనీల‌కు ఈ స్థ‌లాన్ని కేటాయిస్తున్నాం. రూ. 20 కోట్ల‌తో రోడ్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం. ఈ ప‌నుల‌కు ఇవాళ శంకుస్థాప‌న చేశాం. ఈ కంపెనీల ద్వారా స్థానిక యువ‌త‌కు చ‌క్క‌టి కొలువులు వ‌స్తాయ‌ని కేటీఆర్ తెలిపారు.

ఈ ప్ర‌భుత్వం మీది. మీరు ఆశీర్వ‌దించారు కాబ‌ట్టే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త‌దేశంలో 75 ఏండ్ల‌లో ఏ ప్ర‌ధాని, ఏ సీఎం ఆలోచించ‌ని విధంగా ఒక పెద్ద దిక్కుగా రైతుల‌ను ఆదుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. ద‌ళిత బంధు విష‌యంలో రూపాయి లంచం కూడా ఎవ‌రికీ ఇచ్చే అవ‌స‌రం లేదు. ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నాం. అంద‌రూ వినియోగించుకోవాలి. బెల్లంప‌ల్లిలో మంచినీటి స‌మ‌స్య‌ను తీర్చాం. సుర‌క్షిత‌మైన మంచినీళ్లను కూడా అందిస్తున్నామ‌ని తెలిపారు.

Also Read:పిక్ టాక్ : జాన్వీ టెంప్టింగ్‌ పోజులు

సింగ‌రేణిలో 15 వేల మందికి కారుణ్య నియామ‌కాలు చేసుకున్నాం అని కేటీఆర్ చెప్పారు. 4,207 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. గ‌త ప్ర‌భుత్వంలో 540 మంది కార్మికుల‌ను క‌ర్క‌శంగా డిస్మిస్ చేస్తే వారిని తిరిగి కొలువుల్లో పెట్టుకున్నాం. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 ఏండ్ల‌కు పెంచుకున్నాం. లాభాల బోన‌స్‌ను 18 శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నాం. సింగ‌రేణి కార్మికులు ఇండ్లు నిర్మించుకునేందుకు వ‌డ్డీ లేకుండా రూ. 10 ల‌క్ష‌లు ఇస్తున్నాం అని కేటీఆర్ వివ‌రించారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో పేద‌వాడికి ఎంతో మేలు జ‌రిగింద‌ని . కేసీఆర్ నాయ‌క‌త్వంలో పేద‌ల సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నాం. మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ ఇవ్వ‌డం లేదు. ఎన్నిక‌లు రాగానే కొంద‌రు గంగిరెద్దుల మాదిరిగా ఊపుకుంటూ వ‌స్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఒక్క చాన్స్ ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు పాలించింది. 2014కు ముందు క‌రెంట్ స‌మ‌స్య తీవ్రంగా ఉండేది. 9 గంట‌ల క‌రెంట్ అని న‌మ్మ‌బ‌లికి 6 గంట‌ల కంటే ఎక్కువ ఇవ్వ‌లేదు. అర్ధ‌రాత్రి బావుల‌కాడికి వెళ్లే రైతులు క‌రెంట్ షాక్‌ల‌కు, పాము, తేళ్లు కాట్ల‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. విత్త‌నాలు, ఎరువుల‌కు కూడా ఇబ్బందే. ఇది ఆనాటి ప‌రిస్థితి. ఇప్పుడు అలాంటి స‌మ‌స్య లేద‌న్నారు కేటీఆర్.

Also Read:ప్రభాస్ స్టైల్ మార్చాడు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రైతులు అవ‌స్థలు ఎదుర్కొంటున్నారు. ఎక‌రానికి 12 క్వింటాళ్లు మాత్ర‌మే కొంటున్నారు. మిగ‌తా ధాన్యాన్ని కొన‌రు. రైతుబంధు, రైతుబీమా లేదు. మ‌న‌కు మ‌ళ్లీ కాంగ్రెస్ అవ‌స‌ర‌మా..? ఆలోచించాలి. సింగ‌రేణిని బొంద‌పెట్టే ప్ర‌య‌త్నం చేసిన కాంగ్రెస్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇద్దామా..? 55 ఏండ్ల‌లో చేయ‌ని ప‌నులను కేసీఆర్ ఏడేండ్ల‌లో చేసి చూపించాడు. బెల్లంప‌ల్లి అభివృద్ధి బాట‌లో ప‌య‌నిస్తుంది. ఐటీ కంపెనీలు బెల్లంప‌ల్లికి వ‌స్తున్న మాట వాస్త‌వం కాదా..? ఎన్నిక‌లు రాగానే కొంద‌రు వ‌చ్చే మాట్లాడే మాట‌ల‌కు ఆగం కావొద్దు. మంచి నాయ‌కుల‌ను పోగొట్టుకోవ‌ద్దు. ఇత‌రుల మాట‌లు న‌మ్మి ఆగం కావొద్దు. 55 ఏండ్లు ద‌గా చేసిన కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -