సినీ పరిశ్రమలో అందరికి ఆయన బాబాయ్. నిర్మాతగా,నటుడిగా,విలన్‌గా విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. 1944, మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తన కెరీర్లో 12 వందలకు పైగా సినిమాల్లో నటించారు.
తొలుత హీరో అవుదామనే లక్ష్యంతో మద్రాస్‌లో అడుగుపెట్టిన ఆయన ప్రతినాయక పాత్రల ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో కథానాయకుడు చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్‌తో చాలా సినిమాలు చేశారు. దానవీర శూరకర్ణ చిత్రంలో చలపతిరావు ఐదు పాత్రల్ని పోషించారు. ఆ సినిమాలో ఇంద్రుడు, సూతుడు, జరాసంధుడు వంటి పాత్రల్లో చక్కటి అభినయంతో మెప్పించారు.
Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన నిన్నే పెళ్లాడతా చిత్రం నటుడిగా చలపతిరావును కొత్త కోణంలో ఆవిష్కరించింది. అప్పటివరకు విలనీ రోల్స్‌లో ఎక్కువగా కనిపించిన ఆయన ఈ సినిమాలో తండ్రిగా ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకున్నారు.
Also Read:World Red Cross Day:రెడ్ క్రాస్ డే
ఒకానొకదశలో ఓ ఇంటర్వ్యూలో నిన్నే పెళ్లాడతా కంటే ముందు ఆడవాళ్లు తనను చూస్తే భయపడి పోయేవారని, ఆ సినిమా తర్వాతే ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం, షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం మొదలైందని చెప్పారు. ఆర్సీ క్రియేషన్స్ సంస్థను స్థాపించి కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం వంటి సినిమాల్ని నిర్మించారు.చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. డిసెంబర్ 26,2022లో గుండెపోటుతో మరణించారు.