World Red Cross Day:రెడ్ క్రాస్ డే

49
- Advertisement -

ఇవాళ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం.ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో సమాజ హితానికి పనిచేయడమే వీరి కర్తవ్యం.

వాస్తవానికి ఈ సంస్థ ప్రారంభించిన తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు మాత్రమే సేవ చేసేవారు. తర్వాత ప్రమాదాల్లో గాయపడిన వారందరికి సాయం చేస్తూ వస్తున్నారు. ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, రక్తాన్ని సేకరించడం ఈ సంస్థ విధులు.

Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

రెడ్ క్రాస్ ను స్థాపించినది జీన్ హెన్రీ డ్యూనంట్. 1864లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరుగగా రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి. దీని హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉంది. మానవత, నిష్పాక్షికత, సమతౌల్యత, స్వతంత్రం, వాలంటరీ సేవ, ఐక్యత, విశ్వజనీయత ప్రధాన ఉద్దేశాలు.

Also Read:ఉంగరాల జుట్టు… సంరక్షణ చిట్కాలు

- Advertisement -