- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 12 గంటల్లో అవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని76,392 మంది దర్శించుకోగా 36,248 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
వేసవి సెలవుల కారణంగా కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.83 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read:రవీంద్రనాథ్ ఠాగూర్.. రచనలు ఎంతో స్పెషల్
- Advertisement -