సీనియర్ నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి తనయుడు నాగ అన్వేష్ ‘ఏంజెల్’తో మరోసారి తెలుగువారి ముందుకు రాబోతున్నాడు. ఈ సోషియో ఫాంటసీ మూవీ టీజర్ విడుదలైంది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, గత ఏడాది ‘వినవయ్యా రామయ్యా’తో హీరోగా మారాడు నాగ అన్వేష్. నటుడిగా చక్కని ఈజ్‌ను ప్రదర్శించిన నాగ అన్వేష్ ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీ ‘ఏంజెల్’లో నటిస్తున్నాడు.
‘బాహుబలి’ ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న ‘ఏంజెల్’ టీజర్ తాజాగా విడుదలై విశేష స్పందన అందుకుంటోంది.ఇక ఇటీవలే చిత్రీకరణ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుట్ పుట్ చూసిన చిత్రబృందం, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తన కెరీర్ లోనే ‘ఏంజెల్’ గొప్ప సినిమా అవుతోందని హెబ్బా కాన్ఫీడెంట్ గా చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సప్తగిరి ఈ సినిమా రిలీజ్ తరువాత తను నెక్ట్స్ లెవల్ కి వెళ్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో నాగ అన్వేష్ ప్రదర్శీస్తోన్న నటన చూసి పలువురు సీనియర్ నటులు మెచ్చుకోవడం విశేషం.