బాహుబలి-2పై మరో వివాదం

199
Another Controversion for Baahubali 2
- Advertisement -

ఈ నెల 28న అట్టహాసంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న బాహుబలి-2 సినిమాపై మరో వివాదం రాజుకుంది. ఏపీలో ఆరు షోలు అనుమతించడంపై ప్రేక్షకుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా అనుమతించడం చట్ట వ్యతిరేకమని, ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కోరారు. సినిమా థియేటర్లలో షోల ప్రదర్శన వేళలపై చట్టంలో స్పష్టమైన అంశాలున్నాయన్నారు.

రాత్రి నుంచి ఒంటి గంట నుంచి ఉదయం 8 గంటల వరకూ ప్రదర్శనలు ఉండరాదని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకుల సంఘం అభ్యంతరాలపై స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రేక్షకుల సంఘం తెలిపింది.  ప్రభుత్వ నిర్ణయం నూటికినూరుపాళ్లు చట్టవ్యతిరేకమని, ఆరు షోలకు అనుమతినిస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని తెలుగు సినిమా ప్రేక్షుల సంఘం డిమాండ్‌ చేసింది. బాహుబలి-2కు ఆరు షోల అనుమతినిస్తూ ఏపీ సర్కార్‌ శనివారం జీవో జారీచేసిన సంగతి తెలిసిందే.

కర్ణాటకలో చేలరేగిన వివాదం  కట్టప్ప క్షమాపణ చెప్పిన అనంతరం సమసిపోగా తాజాగా ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరోసారి బాహుబలి వార్తల్లో నిలిచింది.

- Advertisement -