మృణాల్ ఠాకూర్ జోరుకి మిగతా హీరోయిన్లు బేజారు అన్నట్టుగా అమ్మడుకి సౌత్ లో అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నిజానికి మొన్నటివరకూ బాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ పని అయిపోయింది, ఆమెకు అక్కడ అవకాశాలు తగ్గాయి అని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే హీరోయిన్ గా ఎంట్రీ, ఇచ్చిన కొత్తలో మృణాల్ ఠాకూర్ కి హిందీలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. మృణాల్ ఠాకూర్ ను హిందీ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్నారు అంటూ ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి.
ఐతే, వరుస ప్లాప్ లు కారణంగా మృణాల్ ఠాకూర్ కి ఇప్పుడు హిందీలో ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. ఈ నేపథ్యంలోనే మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ ఛాన్స్ లు తగ్గాయి. ఐతే ఇప్పుడు సౌత్ లో మృణాల్ ఠాకూర్ బిజీ తారగా మారిపోయింది. ఎలాగూ మృణాల్ ఠాకూర్ కి సీతారామం బ్లాక్ బస్టర్ ఉంది. పైగా మృణాల్ ఠాకూర్ నటనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే, హీరోలు వెనక్కి తగ్గడం లేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ నటనకు హీరోలే కాదు.. ఆడియన్స్ కూడా ఫిదా అవ్వడంతో.. ఆమెకి ఇంత డిమాండ్ పెరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తుంది.
Also Read: ఆదిపురుష్…బిగ్ అప్డేట్ వచ్చేసింది
చరణ్ బుచ్చిబాబుతో రీసెంట్ గా ఓ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాలో చరణ్ సరసన మృణాల్ ఠాకూర్ పేరుని పరిశీలిస్తున్నారట మేకర్స్. చరణ్ – మృణాల్ ఠాకూర్ జోడీ చూడముచ్చటగా ఉంటుందని హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్. ఇక మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసి.. మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.
Also Read: Saindhav:డాక్టర్ రేణుగా రుహానిశర్మ