తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలోని సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహరంపై ప్రధాని సునాక్ స్వతంత్ర దర్యాప్తు పూర్తయిన కొన్ని గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు రిషి సునాక్‌కు రాసిన లేఖను ట్విటర్‌లో పోస్టు చేశారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇలా కీలక పదవులకు రాజీనామా చేసిన వారిలో రాబ్ మూడోవ్యక్తి కావడం గమనార్హం.
Also Read: LPG:దేశంలో రెట్టింపైన ఎల్పీజీ కనెక్షన్లు…
రాబ్‌తో కలిసి పనిచేసే సర్వేంట్స్ నుంచి ఆయన ప్రవర్తనపై ఆరోపణలు వచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ వ్యవహరంపై పూర్తి సమగ్రమైన దర్యాప్తు కోరకు సునాక్ సీనియర్ న్యాయవాది ఆడమ్ టోలీతో దర్యాప్తునుకు ఆదేశించారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అయితే దర్యాప్తు పూర్తి అయిన వెంటనే నివేదిక ప్రధాని వద్దకు రాగానే రాబ్ తన పదవికి రాజీనామా చేశారు.
Also Read: అమెరికాలో మరో విషాదం..
My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq
— Dominic Raab (@DominicRaab) April 21, 2023