Bunny:టాలీవుడ్‌కే స్టైలిష్ స్టార్‌..!

49
- Advertisement -

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారం ఎత్తారు. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న…సినిమాలోని కీలకమైన సన్నివేశాలను విశాఖపట్నంలో షూట్ చేసి వచ్చారు. అయితే షూట్ మధ్యలో గ్యాప్‌ దొరికితే ఎదో ఈవెంట్‌కి అటెండ్ అవుతున్నారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్‌ గుప్త డిజైన్ చేసిన డ్రెస్‌లో అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ కనిపించారు. ఐవరీ మెటాలిక్ టక్సేడో అవుట్ ఫిట్ వేసుకొని వెళ్లారు. అయితే అప్పుడు వేసుకున్న డ్రెస్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి టాలీవుడ్‌కు తనే స్టైలిష్ స్టార్‌ను అని నిరూపించుకున్నారు.

Also read: ఆ బ్యూటీ సూపర్ లక్కీ

ప్రస్తుతం పుష్ప-2 కోసం ప్రపంచమంతటా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడదల చేస్తే…అది కేవలం కొన్ని గంటల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ పెరిగాయి. పుష్ప-2లో ఫాహద్ ఫసల్, రష్మిక మందన్నా, సునీల్, అనసూయ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Also read: పవన్ సినిమాకి నో టైటిల్

- Advertisement -