పవన్ సినిమాకి నో టైటిల్

50
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళ సినిమా వినోదయ సీతంను తెలుగు లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ పెట్టే ఉద్దేశ్యం లేదట. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ, ఈ సినిమాను టైటిల్ పెట్ట‌కుండానే రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఓ హింట్ ఇచ్చాడు. కాగా, సినిమా రిలీజ్‌కు రెండు మూడు నెల‌ల టైముంది. మరి విశ్వ‌ప్ర‌సాద్ చెప్పినట్లు ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ను పెట్టకుండానే రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Also read: Nani:దసరా ఓటీటీలోకి ఎప్పుడంటే..!

నిజంగానే టైటిల్ పెట్టకుండా సినిమాని రిలీజ్ చేయడం అంటే.. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాకి టైటిల్ లేకుండా రిలీజ్ అంటే విశేషమే. పైగా ఇదొక మల్టీస్టారర్ సినిమా. గతంలో ఉపేంద్ర కూడా తన సినిమాకి టైటిల్ పెట్టకుండా సినిమాని రిలీజ్ చేశాడు. కానీ, టైటిల్ పెట్టకపోయినా ఒక సింబల్ ఉంది. మరి పవన్ సినిమాకి ఎలాంటి సింబల్ ను పెడతారో చూడాలి. ఇక యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరియు బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also read: శాకుంతలం నష్టాల లెక్కలు

అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు, ‘శంభో శివ శంభో’ సినిమా డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి.

- Advertisement -