ఆ బ్యూటీ సూపర్ లక్కీ

42
- Advertisement -

యంగ్ బ్యూటీ శ్రీలీల మహా అందగత్తె ఏమీ కాదు. గొప్ప నటి అంతకన్నా కాదు. కాకపోతే, శ్రీలీల ఓ గ్లామర్ డాల్. అంతకు మించి ఒక రెగ్యులర్ హీరోయిన్లకుండాల్సిన లక్షణాలు అన్నీ శ్రీలీల కు ఉన్నాయి. ఐతే, ఆమె సక్సెస్ రేట్ మాత్రం అంత సూపర్ ఏమీ కాదు. అయినా, ఆమెది గోల్డెన్ లెగ్ అంటూ ఫిల్మ్ మేకర్స్ శ్రీలీలకి తెగ ఛాన్స్ లు ఇచ్చేస్తున్నారు. సక్సెస్ రేటు ఉంటే.. అవకాశాలు వస్తాయి. లేదు అంటే.. వేరే కారణాలు రీత్యా ఒక్కోసారి సంయుక్త మీనన్ లా అవకాశాలు అందుకోవచ్చు. కానీ, శ్రీలీల రూటే సెపరేట్. ఆమె అవకాశాలు కోసం అర్రులు చాచడం లేదు.

Also read: Nani:దసరా ఓటీటీలోకి ఎప్పుడంటే..!

అయినప్పటికీ, శ్రీలీల వెనుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హీరోలు కూడా శ్రీలీలే కావాలి అంటున్నారు. ఇప్పటికే శ్రీలీల నవీన్ పోలిశెట్టి సరసన అనగనగా ఓ రాజు చిత్రంలో నటిస్తోంది. ఇంకా పేరు పెట్టని తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంలోనూ, అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్‌తోనూ కలిసి నటిస్తోంది. ఇక బాలయ్య సినిమాలో కూతురి పాత్రలో నటిస్తోంది. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, హీరో వరుణ్ తేజ్ తోనూ ఓ సినిమాకి కమిట్ అయింది. దిల్ రాజు బ్యానర్ లోనూ శ్రీలీల కి ఓ అగ్రిమెంట్ ఉంది. యువీ క్రియేషన్స్ కి కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పందం చేసుకుంది.

Also read: సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

బహుశా ప్రస్తుతం శ్రీలీలకి ఉన్న అన్నీ అవకాశాలు ఏ హీరోయిన్ కి లేవు. నిజంగా శ్రీలీల సూపరే. ఆమెది లక్కీ హ్యాండో, కాదో తెలియదు గానీ, ఆమె మాత్రం సూపర్ లక్కీ. ఆ లక్కు తమకు కూడా కలిసి వస్తుందని మేకర్స్ అనుకుంటున్నారేమో. ఈ తెలుగు కమ్ కన్నడ కుట్టికి ప్రస్తుతానికి ఫుల్ డిమాండ్ ఉంది. అన్నట్టు పవన్ కళ్యాణ్ సరసన కూడా శ్రీలీల ఓ సినిమా చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -