చాలా సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. మే5న గోవాలో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి దేశానికి రానున్నారు. ఈ సమావేశానికి భుట్టోతో పాటు ప్రతినిధి బృందం కూడా రానుంది.
2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసా. 2011 సంవత్సరంలో హీనారబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. ఆమె తరువాత విదేశాంగ మంత్రుల హోదాలో పాక్ నుంచి ఎవరూ భారత్‌లో పర్యటించలేదు.
Also Read:ఆదిపురుష్ కొత్త టీజర్ వైరల్
2001 లో షాంఘైలో ప్రారంభించిన ఎస్‌సీఓ దాని ఆరు వ్యవస్థాపక సభ్యులైన చైనా, కజకిస్థాన్, కిర్గిజస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బేకిస్తాన్ లతో పాటు ఎనిమిది మంది పూర్తి సభ్యులను కలిగి ఉంది. 2017లో భారత్, పాకిస్థాన్ దేశాలు పూర్తి సభ్యులుగా చేరాయి.
Also Read:పొట్టి డ్రెస్‌లో బుట్టబొమ్మ