నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రానికి మెగా మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
Also Read:IPL 2023:డబుల్ ధమాకా..డిల్లీ ఖాతా తెరిచేనా?
మేకర్స్ ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ లో లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 11.11 గంటలకు టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ని విడుదల చేశారు.నరేష్, పవిత్ర అందమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!