గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు.. అభినందించిన సీఎం

74
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్షురావు తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌ సీబీఎస్‌ఈ 12 గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు తల్లిదండ్రులు కేటీఆర్ శైలిమ, చెల్లెలు అలేఖ్య తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యతో పాటుగా క్రీడలు సాస్కృతిక రంగం సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ప్రతిభ పురస్కారాలను అందజేసింది. ఎక్స్‌ట్రా కరికులమ్‌ యాక్టీవిటీలో భాగంగా హిమాన్షు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో కనబరిచిన ప్రతిభకు గాను ఎక్స్‌లెన్స్ అవార్డును అందజేశారు.

Also read: KTR:హైదరాబాద్‌కు మరో ఎంఎన్‌సీ కంపెనీ…

పట్టాను అందుకున్న తర్వాత హిమాన్షు స్టేజీ దిగి తాతగారైన సీఎం కేసీఆర్‌ చేతుల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను పెట్టి పాదాలకు నమస్కరించారు. తాత దీవెనలను తీసుకున్నారు. చిన్నతనం తన చేతుల్లో పెరిగి నేడు పట్టభద్రుడుగా ఎదిగిన మనుమడ్ని హృదయపూర్వకంగా హత్తుకున్నారు. విద్యలోనే కాకుండా ఇతర సామాజిక సేవలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను సీఎం కేసీఆర్ హిమాన్షున అభినందించారు.

Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనుమడిని సీఎం ఆశీర్శదించారు. ఈ కార్యక్రమంలో హిమాన్షుతో పాటుగా క్లాస్‌మేట్ ఆద్విత్ బిగాల గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్‌ బిగాల వారి పెద్దనాన్న ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. గ్రాడ్యుయేషన్ పట్టాలను అందుకున్న విద్యారినీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో ప్రాంగణమంతటా హర్షధ్వానాలతో మారుమోగింది.

- Advertisement -