KAVITHA:అతనెవరో నాకు తెలియదు: కవిత

30
- Advertisement -

తెలంగాణ కోసం పోరాడిన సీఎం కేసీఆర్‌ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇదంతా నామీద కక్షతోనే సీఎం కేసీఆర్‌ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను కేసీఆర్‌ జాతీయ కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని బీఆర్ఎస్‌ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తున్నారని కవిత అన్నారు.

ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని క‌విత తెలిపారు.
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదన్నారు. అతనెవరో కూడా నాకు తెలియదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల సమయంలో మరింత దిగజారి వార్తలు ప్రసారం చేస్తున్నారని అన్నారు.

నా మీద బురదజల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం.. అని క‌విత ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఇవి కూడా చదవండి…

KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు

బీజేపీలోకి కాంగ్రెస్ మహేశ్వర్ రెడ్డి

బీబీసీ ఇండియాపై ఈడీ కేసు..

- Advertisement -