అద్యక్ష మార్పు తప్పదా.. అందుకే డిల్లీ పయనమా ?

75
- Advertisement -

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం సోము వీర్రాజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో బలపడాలని చూస్తున్న కాషాయ పార్టీకి సోము నాయకత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. అరకొర ప్రభుత్వంపై, టీడీపీపై ఘాటు విమర్శలు చేస్తున్నప్పటికి, సోము మాటలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంతవరకు అటు వైసీపీ నుంచి గాని, ఇటు టీడీపీ నుంచి గాని ఏ నేతలు కూడా సోము ను సీరియస్ గా తీసుకోలేదంటే ఆశ్చర్యం లేదు. దీంతో రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీకి సోము వీర్రాజు బలహీన నాయకత్వం పెద్ద తలనొప్పిగా మారింది. అంతే కాకుండా పార్టీలో కూడా సోము వీర్రాజు తీరును విమర్శించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

సోము వీర్రాజు కారణంగానే పార్టీ వీడినట్లు ఆ మద్య కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మినారాయణ లాంటి బలమైన నేతనే సోము పై విమర్శలు గుప్పించి పార్టీ నుంచి బయటకు రావడంతో సోము నాయకత్వంపై బీజేపీ అధిష్టానం కొంత నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు ను తొలగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా పార్టీలోకి కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. పార్టీ పగ్గాలు నల్లారికి అప్పగించేందుకు బీజేపీ చేస్తోందనే గుసగుసలు కూడా పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకి చేరిన వెంటనే.. ఇటు సోము వీర్రాజు డిల్లీకి పయనం అవ్వడం మరింత చర్చనీయాంశం అవుతోంది. దాదాపు మూడు రోజులు సోము డిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ డిల్లీ పర్యటనలో భాగంగా కొంతమంది బీజేపీ పెద్దలతో సోము వీర్రాజు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి నుంచి సోము ను తప్పించే అవకాశం ఉందని అందుకే ఆయనను బీజేపీ పెద్దలు డిల్లీ పిలిపించుకున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నా చర్చ. ఏడాదిన్నర సమయంలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ముందు అధ్యక్ష పదవి మార్చితే అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. అసలు సోమును మార్చే ఆలోచన బీజేపీ పెద్దలో ఉందా ? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -