5 రూపాయల భోజనం అద్భుతమన్న కేటీఆర్

241
- Advertisement -

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పర్యటించారు.నగరంలోని పేదల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కృషిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బన్సీలాల్ పేట జీవైఆర్‌ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన కేటీఆర్ .. పేద వారు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా కేసీఆర్ ముందుచూపుతో సంక్షేమపథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.డబుల్ బెడ్ రూం పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకని స్పష్టం చేశారు..బస్తీలలో బీదల కష్టాలు ఏంటో నాకు తెలుసన్నారు.

KTR Anounces GHMC Canteens Name as 'Annapurna'

అనంతరం.. బేగంపేటలో అన్నపూర్ణ కేంద్రాన్ని ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడే ఐదు రూపాయాల భోజనం రుచి చూశారు. భోజనం తిన్న అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. భోజనం అద్భుతంగా ఉందన్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ కేంద్రాలను 150కి పెంచిన విషయం విదితమే. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం అందించడం బాగుందని పలువురు మెచ్చుకుంటున్నారు.మంత్రి కేటీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -