ప్రపంచంలో అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంట్ సమావేశాలు కేవలం 45గంటలు మాత్రమే సభ్యులు ప్రజాసమస్యల కోసం సమావేశామయ్యారు. దీనికి సంబంధించిన డేటాను థింక్ థాంక్ సర్వే ద్వారా వెల్లడైంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎక్కువభాగం వాయిదాల రూపంలో కొనసాగిందని తెలిపింది. పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువగా అదానీ విషయంపై జేపీసీ వెయ్యాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో ఉభయ సభలు వాయిదాలతో ముగిసింది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ ప్రణాళిక ప్రకారం లోక్‌సభ మొత్తం 133.6 గంటలు పనిచేయాల్సి ఉండగా కేవలం 45(34.28శాతం)గంటలు మాత్రమే పనిచేసింది. రాజ్యసభ 130గంటలు పనిచేయాల్సి ఉండగా కేవలం 31(24.00శాతం)గంటలు మాత్రమే పనిచేసింది. దీంతో ఎక్కువగా లోక్‌సభలో 4.32గంటలు రాజ్యసభలో 1.85గంటలు ప్రశ్నోత్తరాల కోసం కేటాయించారు. మొత్తం పార్లమెంట్ సమావేశాల కాలంలో సాధారణ బడ్జెట్‌పై 14.45గంటల పాటు చర్చించారు. దీనిలో 145మంది ఎంపీలు పాల్గొన్నట్టు పీఆర్ఎస్ లెజిస్టేటివ్ రీసర్చ్ డేటా వెల్లడించింది.
అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 13.44గంటల పాటు చర్చలు జరపగా 143మంది ఎంపీలు పాల్గొన్నట్టు తెలిపింది. మొత్తమీద ఈ సమావేశాల్లో 8బిల్లులు ప్రవేశపెట్టగా..విపక్షాల ఆందోళనల నడుమే ఆరు బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మిగిలిన బిల్లుల గురించి పట్టించుకోలేదని సర్వేలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి…