ప్చ్, పాపం నాని.. దారుణం !

43
- Advertisement -

నాని దసరా సినిమాకి 100 కోట్ల వసూళ్లు ఇలా అలవోకగా వచ్చేశాయి అని పెద్ద పోస్టర్లను కూడా వదిలింది టీమ్. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి ఓ సూపర్ బీఎండబ్ల్యూ కారును కూడా కొనిచ్చాడు నిర్మాత సుధాకర్ చెరుకురి. మరి నిజంగానే దసరా సినిమాకి పుష్కలంగా డబ్బు పారిందా ?, వంద కోట్లు వచ్చాయి అన్నారు. మరి నిర్మాతకు లాభాలు వచ్చాయా ?, ఇలా ఈ కలెక్షన్ల వ్యవహారం పై ఎంతైనా మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి దసరాకి వచ్చినదాని కంటే.. ఇంకా రావాల్సి ఉంది. కారణం ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అయింది. కానీ ఒక్క తెలుగులో తప్ప, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి నష్టాలే వచ్చాయి. ఇతర భాషా ప్రేక్షకులు దసరా సినిమాని అస్సలు పట్టించుకోలేదు.

అసలు హీరోయిన్ కీర్తి సురేష్ కి తమిళంలో – మలయాళంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె సోలోగా చేసిన సినిమాలకు అక్కడ బాగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ, విచిత్రంగా దసరాకి తమిళం మలయాళంలో కలెక్షన్స్ రాలేదు. రిలీజ్ చేయడానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. కీర్తి సురేష్ మొహం చూసయినా తమిళ – మలయాళ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళలేదు. ఇక కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా స్థితి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఇంతకీ ఈ భాషలన్నిటిలో దసరాకి వచ్చిన వసూళ్లు ఎన్నో తెలుసా ?, జస్ట్, కోటీ ఇరవై లక్షలు. ప్రమోషన్స్ కోసం పెట్టిన పెట్టుబడి ఇంతకంటే ఎక్కువే అయ్యి ఉంటుంది.

మొత్తమ్మీద ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ బట్టి దసరా సినిమా ఇతర భాషల్లో డిజాస్టర్ అయింది. పాపం పాన్ ఇండియా స్టార్ కావాలన్న నాని కల దీంతో దారుణంగా భగ్నమైపోయింది. ఇక ఇప్పట్లో నాని మళ్లీ పాన్ ఇండియా ఊసు ఎత్తకపోవడమే మంచిది. ఎందుకంటే ఇతర భాషల్లో ప్రమోషన్ వర్క్ కోసం ఏకంగా ఏడు కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. కానీ రాబట్టింది..కోటీ ఇరవై లక్షలు. దీంతో దసరా పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బలా అయింది.

ఇవి కూడా చదవండి…

ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

బన్నీని సేవ్ చేసిన అక్షయ్ కుమా

మహేష్ తో జక్కన్న.. అప్పటి నుంచేనా?

- Advertisement -