ప్రైవేటీకరణ కేంద్రం కుట్ర.. రంగంలోకి కే‌టి‌ఆర్!

51
- Advertisement -

ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయమై గత కొన్నాళ్లుగా రాజకీయ రగడ రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. కేంద్ర నిర్ణయంపై అన్నీ వైపులా నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెల్లుబోక్కింది. ఏపీలోని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ప్రైవేటీకరణను అపాలంటూ దిక్కర స్వరం వినిపించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో ఏపీ లీడర్స్ అందరూ కూడా చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి ఇప్పటికీ కూడా ప్రవేటీకరణ రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంఅని ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తూ ఆయన సంధించిన ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల ఋణమాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోడి, స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే ఔదార్యం ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. లక్షన్నర కోట్ల విలువ గలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రైవేటీకరణ చేయడం కేంద్రం మనుకోవాలని కే‌టి‌ఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన మేరకు కనీసం ఐదు వేల కోట్ల రూపాయల నిధులనైనా విడుదల చేయాలని కే‌టి‌ఆర్ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. వైజాగ్ ఉక్కు తెలుగువారి హక్కు.. దీనిని కాపాడుకోవడం తెలుగువారి బాద్యత అని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బి‌ఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కే‌సి‌ఆర్ తెలిపారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ విషయంలో కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ నేతలనుంచి బారిగానే మద్దతు లభిస్తోంది. మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఏపీ సి‌ఎం జగన్ కూడా ఈవిధంగా స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -