దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా బాహుబలి : ది కన్‌క్లూజన్. మరోవారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమాను చూసేందుకు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బహుబలి మేనియాను క్యాచ్ చేసుకునేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ కాస్త డిఫరెంట్‌గా బాహుబలి సిమ్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. కనీసం వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న జక్కన్న టీం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమానూ చూడనంతమంది ఈ చిత్రాన్ని చూస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక బాహుబలి 2 టికెట్ల కోసం డిమాండ్ కూడా ఊహించని స్ధాయిలో ఉంది. ఎవరు ఉహించని విధంగా బాహుబలి ఏకంగా 2600 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. బాహుబలి క్రేజ్‌ని క్యాచ్ చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 90 శాతానికి పైగా థియేటర్లో ఈ చిత్రాన్ని ఆడించేందుకు ఎగ్జిబిటర్లు.. బయ్యర్లు పోటీ పడుతున్నారు.
ఇక తాజాగా ఇండియాటుడే మేగజైన్.. ఎడిషన్ కవర్ పేజ్ పై బాహుబలి కనిపించింది. బాహుబలి ప్రభాస్ ఏనుగు మీదకు తొండంపై నుంచి ఎక్కుతున్న పోస్టర్ ను కవర్ పేజ్ పై వేశారు. పొలిటికల్ మేగజైన్ అయినా.. ట్రెండీ అంశాలకు ప్రాధాన్యతనిచ్చే ఇండియా టుడే.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న బాహుబలి గురించి స్పెషల్ కవరేజ్ చేయడంలో ఆశ్చర్యం లేదు.