తేడా చేస్తే.. ముందుగా పోయేది కిరణే

31
- Advertisement -

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి నటుడే. పైగా అదృష్టం బాగుండి.. కథానాయకుడిగా మార్కెట్ దక్కింది. నాలుగైదు కోట్లు అతని పై నమ్మకంగా పెట్టొచ్చు అనే భరోసా ఉంది. కానీ, కిరణ్ బాబుకి పైత్యం ఎక్కువ అయ్యింది. అర్జెంట్ గా మాస్ హీరో అయిపోవాలని అత్యాశ కలిగింది. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘మీటర్’. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనరే అతనికి కావాలట. మరి ప్రేక్షకులు కూడా కావాలి అనుకోవాలి కదా.

అసలుకే, నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో నిర్లక్ష్యపు పోలీసుగా కిరణ్ అబ్బవరం బాగానే కనిపించాడు. కానీ ఇది సరిపోదు. ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కావాలి. అవి మిస్ అయ్యాయి. పైగా వాటి ప్లేస్ లో సిల్లీ పంచ్ లు ఉన్నాయి. అనవసరమైన బిల్డప్ షాట్స్ ఎక్కువయ్యాయి. యాక్షన్ హీరోగా కిరణ్ అబ్బవరంను ఎలివేట్ చేయడం అస్సలు ఏమీ బాగాలేదు. ఒక చిన్న హీరోని మాస్ హీరోగా చూపించడం సాధారణ ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదు.

మరి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని ఏ ధైర్యంతో నిర్మిస్తున్నారో వారికే తెలియాలి. అయినా వారికి పోయేది ఏమీ ఉంది. ఈ సినిమా ఎలా ఉన్నా.. సినిమాని అమ్ముకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య . కానీ, తేడా చేస్తే.. ముందుగా పోయేది కిరణ్ అబ్బవరమే. అసలు కిరణ్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు… అని కొంతమంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -