Karnataka Assembly: ఓటు ఫర్ హోమ్

16
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. తొలిసారి కర్ణాటక ఎన్నికల్లో ఓట్ ఫర్ హోమ్ అవకాశాన్ని కల్పించారు. అది 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు. ఈ విషయాన్ని వెల్లడించారు సీఈసీ రాజీవ్ కుమార్. మొత్తం 224 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు.

ఏప్రిల్ ఒక‌టో తేదీ 2023 వ‌ర‌కు 18 ఏళ్లు నిండిన‌వారికి ఓటు హ‌క్కు క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ఈసారి కొత్త‌గా 41 వేల మంది యువ ఓట‌ర్లకు అవ‌కాశం ద‌క్క‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. క‌ర్నాట‌క‌లో తొలిసారి 9.17 ల‌క్ష‌ల మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

గిరిజ‌న తెగ‌ల( ప్ర‌జ‌ల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు… మొత్తం 58 వేల 282 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌కు స‌గ‌టున 883.50 ఓటర్లు ఉంటార‌న్నారు. 1320 పోలింగ్ స్టేష‌న్ల‌ల‌ను కేవ‌లం మ‌హిళా అధికారులే మేనేజ్ చేయ‌నున్నారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్ధానాలుండగా ఆప్ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి బరిలోకి దిగుతుండగా, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -