అసలు కమల్ హాసన్ కి ఏమైంది?

45
- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఇండియన్ 2 కోసం గ్యాప్ లేకుండా షూట్ లో పాల్గొంటున్నారు. ఐతే, అలాంటి కమల్ హాసన్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు కలవర పెడుతున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉన్న కమల్ హాసన్ రీసెంట్ గా ఆసుపత్రికు వెళ్లారు. మొదట షూటింగ్లో భాగం అనుకున్నారు. తర్వాత హెల్త్ చెకప్ కోసమని తెలిసింది. అసలు కమల్ హాసన్ కి ఏమైంది ? అంటూ కోలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఇండియన్ 2 షూట్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న కమల్ హాసన్ కి కిడ్నీ సమస్య ఉందని తెలుస్తోంది. ఐతే, కోలీవుడ్ వర్గాల ప్రకారం కమల్ హాసన్ ఆరోగ్య సమస్య పెద్దది ఏమి కాదు అని, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. కమల్ హాసన్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే షూట్ లో జాయిన్ అయ్యాడట. ఏది ఏమైనా కమల్ హాసన్ ఆరోగ్యం మీద వరుస కథనాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇక ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే.. గ్రేట్ విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఇది. అందుకే.. భారతీయుడు 2 పై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగా ఆసక్తి చూపిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : కాకరేపుతున్న కుర్ర భామ!

కీర్తి సురేష్ లవర్‌ అతనే!

పఠాన్ ఓటీటీలోకి ఎప్పుడంటే..!

- Advertisement -