మోడీజీ.. వీటికి సమాధానం చెప్తారా ?

64
- Advertisement -

దేశంలో అవినీతిని అంతం చేయాలని, అవినీతి రహిత పాలన అందిస్తామని.. కల్లబొల్లి మాటలు చెబుతున్న మోడీ సర్కార్.. విపక్ష పార్టీల నేతలపై ఈడీ అస్త్రాలను ప్రయోగిస్తూ జబ్బలు చారుస్తుంది. కానీ వారు చేస్తున్న అక్రమాలను మాత్రం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకరిని వేలెత్తి చూపిస్తే మనవైపు మూడు వెళ్ళు చూపిస్తాయన్నట్లుగా అవినీతి మరకను విపక్షలకు అంటిస్తూ.. వారికున్న మరకను మాత్రం దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. కేంద్ర దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో ఉంచుకొని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ నియంత దొరణిలో వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న విధానాలపై సామాన్యుడి మదిలో ఎన్నో ప్రశ్నలు రాక మానవు.

ప్రతిపక్ష నేతలు మాత్రమే అవినీతి చేస్తున్నారా ? ప్రభుత్వ నేతల్లో ఎలాంటి అవినీతి లేదా ? అనే ప్రశ్నకు మోడీ సర్కార్ వద్ద సమాధానం లేదు. అలాగే అకౌంటింగ్ మోసాలకు పాల్పడిన ఆధాని గ్రూప్ కంపెనీలపై మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోదా ? అసలు ప్రశ్నిస్తే కేసులెందుకు పెడుతోంది ? ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తోంది ? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతున్నాయి. ఇకపోతే ప్రశ్నించే వారి గొంతు నేక్కే ప్రయత్నంపై చూపే శ్రద్ద దేశంలో పెంచిన రేట్లను తగ్గించడంలోనూ, భారీగా పెరిగిన నిరుద్యోగాన్ని తగ్గించడంలోనూ.. చూపాలని మోడీ సర్కార్ కు విపక్షాలు చురకాలంటిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును కులాంకుశంగా పరిశీలిస్తే మోడీ నిరంకుశ పాలనకు అద్దం పడుతున్నాయనే సంగతి ఇట్టే అర్థమౌతుంది. అయితే మోడీ సర్కార్ చేస్తున్న ఈ అక్రమ పరిపాలనను దేశ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనె సంగతి మర్చిపోతే వచ్చే ఎన్నికల్లో మోడీకి దేశ ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి…

సర్వేలన్నీ అనుకూలం..విజయం తథ్యం…

నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

కేటీఆర్‌…ఒక ట్వీట్‌తో సమస్య పరిష్కారం

- Advertisement -