రేపట్నుంచి మహిళల క్రికెట్ పోరు..!

23
- Advertisement -

మరొక్క రోజుల్లో మహిళా ప్రీమియర్ లీగ్‌ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో ఈ లీగ్ కోసం ప్రత్యేకంగా బీసీసీఐ ఓ థీమ్ సాంగ్‌ను రెడీ చేసింది. దీన్ని లీగ్ ఆరంభం ప్రారంభ సమయంలో విడుదల చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందులో మొత్తంగా ఆరుగురు ఆర్టిస్ట్‌లతో కలిసి థీమ్ సాంగ్‌ను రూపొందించినట్టు బీసీసీఐ ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

మహిళా ప్రీమియర్ లీగ్ వేడుక మార్చి4న ప్రారంభంకాగా..మార్చి 26న ముగుస్తాయి. మొత్తం 20లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగ్గా..23రోజుల పాటు క్రికెట్‌ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్‌(MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), ఢిల్లీ క్యాపిటల్స్‌(DC), యూపీ వారియర్స్(UPW), గుజరాత్ జెయింట్స్‌(GG).

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఎంఐకి కెప్టెన్‌ కాగా, స్మృతి మంధాన ఆర్సీబీకి, ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ డీసీకి, బెత్‌మూనీ జీజీకి కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. మొదటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ వర్సెస్ గుజరాత్ జెయింట్స్‌కి రాత్రి 7.30గంటలకు ప్రారంభమవుతుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌ మార్చి 26న జరుగుతుంది. భారత కాలామానం ప్రకారం… ముంబైలోని డీవై పాటీల్ స్టేడియంలో మరియు బ్రబౌర్న్‌ స్టేడియంలో ఈ మెత్తం మ్యాచ్‌లు జరుగుతాయి.

మహిళా క్రికెట్ షెడ్యూల్‌ ఇదే…

  1. మార్చి 4 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  2. మార్చి 5 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ – 03:30 PM బ్రబౌర్న్‌లో
  3. మార్చి 5 – యూపీ వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  4. మార్చి 6 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 07:30 PM బ్రబౌర్న్‌లో
  5. మార్చి 7 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్జ్ – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  6. మార్చి 08 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 07:30 PM బ్రబౌర్న్
  7. మార్చి 09 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  8. మార్చి 10 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్ – 07:30PM బ్రబౌర్న్‌లో
  9. మార్చి 11 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  10. మార్చి 12- యూపీ వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ – 07:30 PM బ్రబౌర్న్‌లో
  11. మార్చి 13 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  12. మార్చి 14 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ – 07:30 PM బ్రబౌర్న్‌లో
  13. మార్చి 15 – యూపీ వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  14. మార్చి 16 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్- 07:30 PM బ్రబౌర్న్‌లో
  15. మార్చి 18 – ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్జ్ – 03:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  16. మార్చి 18 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ – 07:30 PM బ్రబౌర్న్‌లో
  17. మార్చి 20 – గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్జ్ – 03:30 PM బ్రబౌర్న్
  18. మార్చి 20 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  19. మార్చి 21 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ – 03:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  20. మార్చి 21 -యూపీ వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – 07:30 PM బ్రబౌర్న్‌లో
  21. మార్చి 24 – ఎలిమినేటర్ 07:30 PM డీవై పాటిల్ స్టేడియంలో
  22. మార్చి 26 – ఫైనల్ – 07:30 PM బ్రబౌర్న్

ఇవి కూడా చదవండి…

మూడో టెస్టులో భారత్ ఓటమి..

వాంఖడే…సచిన్‌కు నిలువెత్తు విగ్రహం

ఐపీఎల్‌16…బుమ్రా దూరం నిజమేంత?

- Advertisement -